![]() |
![]() |

బుల్లితెర మీద పొదరిల్లు ఒక వైపు మరో వైపు గుండె నిండా గుడి గంటలు సీరియల్ దుమ్ము రేపుతున్నాయి. ఇక నెక్స్ట్ వీక్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి ఈ రెండు సీరియల్ యాక్టర్స్ రాబోతున్నారు. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "ఒకే వేదికపై రెండు టాప్ రేటెడ్ సీరియల్స్ కొట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా" అంటూ శ్రీముఖి అనేసరికి పొదరిల్లు సీరియల్ వాళ్ళు వచ్చేసారు. "గుండె నిండా గుడి గంటలు వెర్సెస్ పొదరిల్లు " అని శ్రీముఖి చెప్పేసింది.
ఇక పొదరిల్లు టీమ్ జెండాలేసుకుని స్టేజి మీదకు వచ్చేసింది. "చక్రి మహాలక్ష్మి " అంటూ శ్రీముఖి అరిచింది . "చూడు ఇక్కడ గుండెల మీద లోపల కూడా రాసుకొచ్చా పొదరిల్లు అని " అంటూ హరి చెప్పాడు. "హరి పొదరిల్లు ఫ్యాన్ ఐపోతే మీరు నాకు బావా ఐపోవాలా " అంటూ కృతిక గట్టిగానే అడిగింది. వెంటనే అవినాష్ సూపర్ కృతిక అంటూ పొగిడేసాడు.
"అందరూ ఇలా మహాలక్ష్మి మీద పడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి " అని చక్రిని అడిగింది శ్రీముఖి. "బ్రదర్ ఇన్ లా నే ఏమయ్యింది " అన్నాడు చక్రి. వెంటనే కృతిక "బ్రదర్ ఇన్ లా అంటే బావా " అని చెప్పింది. "గుండె నిండా గుడి గంటలు రండిరా మీకెక్కిస్తా మెంటలు " అంటూ కృతిక - చక్రి మంచి జోష్ తో చెప్పారు. తర్వాత గుండె నిండా గుడిగంటలు టీమ్ అంతా వచ్చింది. ఇక బాలు - అమూల్య గౌడ ఫుల్ జోష్ తో ఉన్నారు.
"పొదరిల్లు మా ముందు మీరు నిల్లు " అంటూ బాలు డైలాగ్ చెప్పాడు. "మేమిచ్చే ఎంటెర్టైన్మెంట్ ఫుల్లు " అంటూ అమూల్య చెప్పింది. తర్వాత అబ్బాయిల కళ్లకు గంతలు గట్టి అమ్మాయిల చేతులు పట్టుకుని వాళ్ళ పేర్లు చెప్పే టాస్క్ ని పెట్టింది శ్రీముఖి. ఇక చక్రి ఐతే "పాట వినబడితే వేస్తాము డాన్స్. ఎక్కడికెళ్లినా పొదరిల్లుకు ఉంటారు డై - హార్ట్ ఫ్యాన్సు " అంటూ కళ్ళజోడు పెట్టుకుని మరీ స్టైలిష్ గా డైలాగ్ చెప్పాడు.
"బాలు శ్రీముఖిని అందరూ అందరూ అంటారు బ్యూటీ. నా సీరియల్ కి ఎవరూ లేరు పోటీ" అంటూ బాలు శ్రీముఖి చేయి పట్టుకుని మరీ డైలాగ్ చెప్పాడు. "బాలుని గుండె మీద చెయ్యేసుకుని చెప్పమనండి ...పర్ఫెక్ట్ గా డైలాగ్ చెప్పాడా " అంటూ హరి అడిగేసరికి బాలుకి మండిపోయింది. "గుండె మీద చెయ్యేసుకుని చెప్తా ఏ బోకడా గాడు రాశాడో తెలీదు చాలా చెండాలంగా రాసాడు " అంటూ గట్టిగా తిట్టాడు హరిని.
![]() |
![]() |